సీఐ అంజూయాదవ్ ను మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఐ చేయి చేసుకున్నారని, పవన్ కు చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో చిన్న సంఘట జరిగితే రాయలసీమ గుండాలు అన్నప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించ లేదు? అని నిలదీశారు. చంద్రబాబును సంతృప్తి చేయటమే పవన్ కల్యాణ్ అజెండా అని విమర్శించారు. హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి.. రాజకీయం అంటే ఒక బాధ్యత.. ఊగిపోతూ మాట్లాడటం.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం కాదు అని హితవుపలికారు.. ధైర్యం ఉంటే 2014లో టీడీపీ మేనిఫెస్టోను కార్యకర్తల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. మేం ప్రతి ఇంటికి మేనిఫెస్టో తీసుకుని వెళుతున్నాం.. అమరావతిలో పేదవాళ్ళు ఉండకూడదన్న టీడీపీకి, అన్ని వర్గాల వారు ఉండాలని 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన జగన్ కు పొంతన ఉందా? చంద్రబాబు 14 ఏళ్ళ పాలన, జగన్ నాలుగేళ్ల పాలన పై చర్చకు మేం సిద్ధం అంటూ సవాల్ చేశారు.