పరిపాలనలో గొప్ప మార్పునకు సంకేతం జగనన్న సురక్ష అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు అన్నారు. సింగుపురం, నిజామాబాద్ గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ప్రభుత్వం పౌరుల సౌకర్యార్థం జగనన్న సురక్ష పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది. పరిపాలనను ఇంటి గుమ్మం దగ్గరకే తీసుకు వచ్చాం. నాలుగేళ్లలో పౌరుల ప్రయోజనం కోసం నిష్పక్షపాత ధోరణిలో పథకాలు అమలు చేసి అందజేశాం అని తెలియజేసారు.