రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ నాయకులూ చంద్రబాబు తన నివాసంలో దాదాపుగా 120 మంది ముస్లిం మత పెద్దలతో భేటీ కానున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై మత పెద్దల అభిప్రాయాలను టీడీపీ అధినేత తెలుసుకోనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రముఖులు, మత పండితులు, మౌలానాలు, ముఫ్తీలు, ప్రజా సంఘాలకు చంద్రబాబు ఆహ్వానం పంపారు. శాసనమండలి మాజీ అధ్యక్షులు ఫారూక్ పేరుతో అధినేత ఆహ్వానాలు పంపించారు. ఇప్పటికే చంద్రబాబును మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారూక్ షుబ్లీ కలిసి యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించాలని కోరారు.