తన కుటుంబం కోసం వ్యక్తి తన ప్రాణాలని త్యాగం చేసిన సంఘటన అనంతపురం జిల్లా, నార్పలలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... బాలనాగి బాలకృష్ణ(40) అనే రైతు మొక్కజొన్న పంటకు పురుగుల మందు కొట్టేందుకు మంగళవారం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లాడు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో కరెంటు పొయింది. దీంతో స్టార్టర్ పెట్టె వద్దకు వెళ్లి పరిశీలించాలని భార్య భాగ్యలక్ష్మికి సూచించాడు. ఆమె పిల్లలతో కలిసి స్టార్టర్ బాక్స్ స్విచ తాకగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన బాలకృష్ణ, పరుగున వెళ్లి తన లుంగీతో ముగ్గురినీ దూరంగా లాగాడు. ఆ క్రమంలో కాలుజారి స్టార్టర్ పెట్టెమీద పడ్డాడు. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బటయ పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa