అనంతపురం జిల్లా, పామిడి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులోని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి స్వగృహంలో మంగళవారం ముస్లిం మైనార్టీలతో టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ సైఫుద్దీన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీడీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలకు స్వస్థి పలికిందన్నారు. ఈనెల 30న జిల్లా కేంద్రంలోని కమ్మభవనలో నిర్వహిస్తున్న ముస్లిం మైనార్టీ సదస్సుకు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa