ప్రకాశం జిల్లా, కంభం మండలం ఎల్.కోట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..... ఎల్.కోట గ్రామానికి చెందిన సాంబ, నాగలక్ష్మి దంపతుల కుమార్తె పసుపుల శివసంధ్య(12) ఎల్.కోట గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి చదువు తోంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు స్నానం చేసి గూట్లోని దుస్తులు తీసుకొంటోంది. అయితే దుస్తుల్లో ఉన్న తేలు బాలిక మెడపై కుట్టింది. వెంటనే బాలికను మార్కాపురం వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. వైద్యం చేయిస్తుండగా మంగళవారం మృతిచెందింది.