ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కె.రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో జరిగిన ఈ సమావేశానికి నీల్ రహేజాతో పాటు ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కె.రహేజా గ్రూప్ ప్రతినిధులు ఆహ్వానించారు. కాగా, విశాఖపట్నంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మించనున్నారు.
రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో కె రహేజా గ్రూప్ రూ. 600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏపీలో మరిన్ని పెట్టుబడులపై సీఎం జగన్తో రహేజా గ్రూప్ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు.