జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు దుమారంరేపాయి. మెగాస్టార్ చిరంజీవిపై అరుణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశాన్ని ప్రస్తావించారు. అరుణ వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది జనసైనికులు సైతం అరుణ తీరును తప్పుబట్టారు. అయితే అరుణకు మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు మదద్తుతగా నిలిచారు.
'మా చెల్లెలు రాయపాటి అరుణ మాట్లాడిన సందర్భం ఏంటో, ఏం మాట్లాడితే ఆ మాట అన్నాదో అర్దం చేస్కోవటాని ట్రై చెయ్యండి. అనవసరమైన కామెంట్స్ అరుణ మీద పెట్టొద్దు, మన జనసేన యూనిటీని దెబ్బ కొట్టటానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. అరుణ మాటలు నేను విన్న ఏదో ఫ్లో లో వచ్చిన small slip of tongue. ఈ విషయాన్నీ ఇక్కడితో ఆపి అరుణ లాంటి ఒక సోదరిని తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. జనసేన కోసం నిరంతరం కష్టపడే వీరమహిళ. Aruna I am with you sister' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
నాగబాబు ట్వీట్‌పై అరుణ కూడా స్పందించారు. 'అన్నయ్య నమస్కారం. నా చివరి శ్వాస వరకు నేను మెగా ఫ్యామిలీ కి, జనసేన కి ద్రోహిని అవ్వను. రాజకీయాలకి అతీతం నా అభిమానం మీ కుటుంబం మీద. అరుణ అనే అమ్మాయి ఎప్పటికి కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగబాబు గారికి విధేయురాలు. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. Thank you అన్నయ్య' అంటూ అరుణ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే 'దయచేసి జనసేన అభిమానులు అలాగే నా మీద అభిమానం చూపించే సోదరులు ఎవ్వరు ఇప్పుడు జరుతున్న డిస్టర్బన్స్ లో reply లు ఇవ్వొద్దు.పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు నన్ను తిట్టరు. కావాలి అని అన్నదమ్ములు ఇద్దరి ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెట్టి jsp కి నష్టం చెయ్యాలి అని వైసీపీ ప్లాన్' అంటూ మరో ట్వీట్ చేశారు. జనసైనికులు అనవసరంగా వాళ్ల ట్రాప్‌లో పడొద్దన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రభావం రాష్ట్రంపై పడిందన్నారు అరుణ. చిరంజీవి వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారంటూ అరుణ వ్యాఖ్యానించారు. ఓ టీవీ డిబేట్‌లో అరుణ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి ఫెయిల్యూర్ దారి వేశారని.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తాను మాట్లాడిన వీడియోలో తమకు అవసరమైన ఈ బిట్‌నే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారునేది అరుణ వాదన. అందరూ ఆ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయాలన్నారు.