ఎన్డీయే సమావేశానికి ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఇద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరరావుతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.