పాఠశాలల్లో మాతృభాష బోధనపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.విద్యార్థులకు బేసిక్ లైన్ పరీక్షలు జరపడం లేదని..జరిపినా ఫలితాలు వెల్లడించడం లేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. మాతృభాష తెలియకపోతే వేరే భాషలపై పట్టు ఎలా వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే విద్యార్థుల్లో మాతృభాష అధ్యయన సామర్థ్యం పెంచేందుకు ఏం చర్యలు చేపట్టారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.