పోలండ్‌కు చెందిన పోలాక్ బార్బర్ (45) అనే మహిళకు జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్ షాదాబ్ (35)తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన ఆరేళ్ల కూతురిని తీసుకుని భారత్‌కు వచ్చింది. పోలాక్‌కు ఇదివరకే పెళ్లై ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మహ్మద్‌తో అతని ఇంట్లోనే ఉంటుంది.