విమానం కుప్పకూలి పైలెట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతిచెందిన ఘటన కొలంబియాలో జరిగింది. మృతులు కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆ దేశ సివిల్ ఎవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. మృతిచెందిన వారికి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa