జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుందని, 11 రకాల సేవలను లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష ద్వారా 57 లక్షల మందికి సర్టిఫికెట్లు అందించామని చెప్పారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేయడమే సీఎం వైయస్ జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబు, పవన్‌పై బీజేపీకి నమ్మకం లేదన్నారు. పవన్ ఒక రాజకీయ అజ్ఞాని..అందుకే వలంటీర్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌కు తనపై తన పార్టీపై నమ్మకం లేదన్నారు.ఒంటరిగా వెళ్లి గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు.