సోమవారం రాత్రి ఆక్వా నర్సరీలో వాకింగ్ చేస్తుండగా ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణాపాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పూర్తయిన అనంతరం హాస్పిటల్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆమంచిని సీఎం జగన్ ఫోన్ లో పరామర్శించారు.