కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి షేక్ మాసుంబాషా ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 110 బస్తాల రేషన బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటి తహసీల్దారు రూపేష్ వివరాల మేరకు... మండల పరిధిలోని కరమలవారిపల్లి గ్రామ సమీపంలోని ఓ గోడౌనలో చంద్రశేఖర్ అనే వ్యక్తి కార్డుదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి అక్రమంగా నిల్వ ఉంచారు. ఈ సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి.. 110 బస్తాల్లో గల 5510 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2,14,980 ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు ఈదురుబాషా, జమ్మలమడుగు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి వరద కిశోర్‌రెడ్డి, విజిలెన్స్ సిబ్బంది జనార్ధన్‌రావు, హెడ్‌కానిస్టేబుల్ క్రిస్ణానాయక్, కానిస్టేబుల్ కర్మవారిపల్లె వీఆర్వో స్వామి పాల్గొన్నారు.