పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.