రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జులై 20వ తేది వచ్చినా కనీసం కాలువలు మరమ్మతులు చేయలేదని.. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారన్నారు. గోదావరి వరదలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కులు వదిలేస్తున్నారన్నారు. కానీ పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వటం లేదన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందని పట్టిసీమ మోటార్లు ఆన్ చేయటం లేదని కన్నా అన్నారు. జగన్ రెడ్డి సైకో అని నేను తొలి నుంచి చెబుతాన్నానన్నారు.