పార్లమెంటు సెంట్రల్ హాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అసభ్య పదజాలంతో విశాఖ ఎంపీ ఎంవీవీ దండెత్తారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తా అంటూ... ఇతర ఎంపీల ముందే రఘురామపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నువ్వెవడివి నా కుటుంబం గురించి లేఖ రాయడానికి?’ అంటూ ఎంవీవీ ఫైర్ అయ్యారు.