కొరిశపాడు మండలం, పమిడిపాడు గ్రామంలో గురువారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన పిన్నక వెంకట్రావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 10 లక్షల రూపాయల ఎల్ఓసిని అద్దంకి వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య వెంకట్రావు సతీమణికి అందజేశారు. ఆపద సమయాలలో ముఖ్యమంత్రి సహాయనిధి బాసటగా నిలుస్తుందని కృష్ణ చైతన్య పేర్కొన్నారు.