పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన ఘటన యూపీలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ యువతికి నారియావాల్కు చెందిన ప్రదీప్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లుగా ఆమెతో శారీరకంగా కలిసాడు. ఇంతలో అమ్మాయి గర్భం దాల్చడంతో బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోమని ప్రదీప్‌కు అడిగితే నిరాకరించాడు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.