పొదుపు మహిళలు తీసుకుంటున్న వివిధ రకాల బ్యాంకు రుణాలతో జీవనోపాధి మెరుగుపడేలా చూడాలని డీఆర్ డీఏ డీపీఎం డేవ్ అన్నారు. గురువారం ఎర్రగొండపాలెంలోని స్త్రీశక్తి భవనంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ఎస్ఈ, జగనన్న బడుగు వికాస్ లాంటి పథకాలతో రూ. లక్ష నుంచి రూ. పది లక్షల దాకా రుణాలు ఇవ్వొచ్చన్నారు. యూనిట్ నెలకొల్పడంపై మహిళలకు అవగాహన కల్పించారు. ఏ. సి లక్ష్మి రెడ్డి, ఏ. పి. ఎమ్ లు ఉన్నారు.