పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ వ్యక్తి గన్‌తో చొరబడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి దగ్గర తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నల్లకోటు, టై ధరించిన ఓ వ్యక్తి పోలీసుగా మమతా బెనర్జీ ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa