సేవా మిత్రలు, సేవా రత్నాలు, సేవా వజ్రాలు అయిన వలంటీర్ల వ్యక్తిత్వాలను తప్పుబడుతూ పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్.. ఇంకొకరు చంద్రబాబు, మరొక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ గజదొంగల ముఠా మాట్లాడుతోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే దత్తపుత్రుడు వలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్టు రామోజీరావుది, నిర్మాత చంద్రబాబు.. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివన్నారు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునేవాడు, మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్‌లో డ్యాన్స్‌లు చేసేవాడు, అమ్మాయిలు కనిపిస్తే కడుపు చేయాలనేవాడు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభ వేదిక నుంచి ప్రతిపక్షాల వ్యాఖ్యలకు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.