దేశంలో హార్టికల్చర్ రంగం అభివృద్దికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం అమలు చేస్తోందని మంత్రి నరేంద్ర సింగ్ తెలిపారు. అలాగే హర్టికల్చర్ క్లస్టర్లలో భౌగోళికపరమైన ప్రత్యేక పంటలు ప్రోత్సహించేందుకు, ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో, పంట దిగుబడి తరువాత, లాజిస్టిక్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ కొరకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేస్తోందని అన్నారు.