గ్రామ, వార్డు వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారంపై ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు సంధించారు. వాటికి సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
1. వాలంటీర్లకు బాస్ ఎవరు?
2. ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?
3. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?
అని సీఎం జగన్ను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.