వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగండంగా బలపడుతుందని పేర్కొంది.