ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్.. పలు రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 23, 2023, 06:50 PM

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. పలు రైళ్లను పాక్షికంగా పలు ప్రాంతాల మధ్య రద్దు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.


హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మెయింటటెన్స్ పనులను దృష్టిలో పెట్టుకుని పలు రైళ్లను రద్దు చేశారు. కర్నూలు సిటీ-సికింద్రాబాద్(17024) రైలును 25న 90 నిమిషాలపాటు, గుంతకల్-బోధన్(07671) ట్రైన్‌ను 26,27,30వ తేదీలలో 120 నిమిషాల పాటు రీ షెడ్యూల్ చేశారు. ఇక దండి-నిజామాబాద్(11409) ట్రైన్‌ను 24 నుంచి 30వ తేదీ వరకు ముద్ఖేడ్-నిజామాబాద్, నిజామాబాద్-పండర్పూర్(01413) రైలును 25 నుంచి 31 వరకు నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య రద్దు చేశారు.


ఇక కాచిగూడ-నిజామాబాద్(07596), నిజామాబాద్-కాచిగూడ(07593), నాందేడ్-నిజామాబాద్(07854) రైళ్లను 24 నుంచి 30వ తేదీ వరకు, నిజామాబాద్-నాందేడ్(07853) ట్రైన్లను 25 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. చీకటిగలపాలెం-శావల్యాపురం మధ్య నాన్ ఇంటర్ లాంకింగ్ పనులు జరుగుతున్న క్రమంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) ట్రైన్‌ మార్కాపురం నుండి తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com