ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిపై నోరు పారేసుకున్న జగన్, నేడు అధికారంలోకి వచ్చి పేదలతో మనందరి రాజధాని అమరావతి అంటున్న జగన్కు అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రకటించే దమ్ము ఉందా అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సవాల్ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... ‘‘రాజధానిలో పేదలకిచ్చే ఇళ్ల స్థలాలకు చట్టబద్ధత లేదని సుప్రీం కోర్టు చెప్పినా, సీఎం జగన్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం పేదలను మోసం చేయడమే. జగన్ నిర్ణయాల వలన చివరికి నష్టపోయేది పేదలే’’ అన్నారు.