ప్రస్తుతం రాష్ట్రంలో బాగా సాగవుతున్న పంట, ఒక్కటే అది గంజాయి పంట అని టీడీపీ నాయకులు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేడు మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.... నాలుగేళ్లల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. చేతగాని ప్రభుత్వం ఉంటే రైతులు ఎలా నష్టపోతారోనడానికి నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనమన్నారు.ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడా పంటలు వేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యం రైతుకి గిట్టుబాటు ధరలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా చంపేసిందన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారన్నారు.