సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఐతే ఈ విషయంపై టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ.... ఒక విషయం కోర్టుపరిధిలో ఉండగా ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమనేది నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వేళ రేపు తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ సెంటు భూమిలో ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారు. మీ మూర్ఖత్వపు చర్యల వలన ఇల్లు కట్టుకున్న అమాయకమైన పేదలు నిలువునా బలైపోతారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాస్థూ రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి, పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో అమరావతిని నాశనం చేసేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తూ నాటకాలు ఆడుతున్నారు’’ అంటూ మాజీ మంత్రి గంటా ట్వీట్ చేశారు.