దేశంలో ఘోరమైన, అతి కిరాతకమైన సంఘటనలు చోటుచేసుకుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వం లెక్కలేని తనంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... . మణిపూర్‌లోని విలువైన సంపదను బీజేపీ కుట్రపూరితంగా కొట్టేయడానికి ప్రయత్నిస్తోందని, ఇప్పటికే అదానికి 54వేల ఎకరాల భూమిని అప్పగించిందన్నారు. దీనికి అడ్డుపడుతున్న గిరిజనులపై మరో వర్గాన్ని ఉసిగొల్పి అల్లర్లు సృష్టిస్తున్నట్టు ఆరోపించారు. ఏపీ విభజన చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. సీఎం జగన్ పైకి బీజేపీకి వ్యతిరేకంగా కనిపించినా లోపల మాత్రం వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి మద్దతు పలికిన పార్టీలేవైనా తెలుగువారికి ద్రోహం చేసినట్టేనని నారాయణ అన్నారు.