కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో దేవనకొండలోని లక్ష్మీరంగా కళ్యాణ మండపంలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సందరంగా ఆమె మాట్లాడుతూ... జగన్మోహన్రెడ్డి మోసపూరిత రాజకీయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు సీఎం కావలసిన అవసరం ఎంతైనా ఉందని , కాబట్టి దానికోసం అందరం కలిసికట్టుగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు.