రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అక్టోబరు 2 నుంచి తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలకు ప్రముఖ క్రీడాకారులు అంబటి రాయుడు, కరణం మల్లేశ్వరి, పి.వి. సింధు, హారిక, శ్రీకాంత్, వి.జ్యోతి సురేఖ వంటి వారిని స్పోర్ట్స్ అంబాసిడర్లుగా భాగస్వాములను చేసేందుకు వారితో వ్యక్తిగతంగా మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎపెక్స్ కమిటీ సమావే శంలో ఆయన అధికారులతో మాట్లాడారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడల్లో 46 రోజులపాటు సుమారు 3 లక్షల మ్యాచ్‌లు నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీటికి అదనంగా 3 వేల మారథాన్, యోగా టెన్నియిట్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.