నారా లోకేష్‌ను విమర్శించే స్థాయి మార్కాపురం వైసీపీ నాయకులకు లేదని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. ఈ సందరంగా అయన మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్ట్ త్వరిగతిన పూర్తిచేయడం, మార్కాపురం ప్రాంతానికి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా అశేషంగా తరలివచ్చిన మహిళమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.