ప్రతిపక్ష కూటమి 'INDIA'పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాల కూటమికి సరైన దిశ లేదని పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీలను విదేశీయులు కూడా ప్రారంభించారని, దేశం పేరును వాడుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరంటూ ప్రధాని విమర్శించారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందంటూ వ్యాఖ్యానించారు.