మంత్రి జోగి రమేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం పెడనలో జనసేన నాయకులూ నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ జనసేన పార్టీ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. పెడనలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.