శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో రాష్ట్ర తూనికలు, కొలతలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో బియ్యం, కంది పప్పు తదితర నిత్యావసర వస్తువులను తక్కువ తూకంతో, ఎక్కువ ఎమ్మార్పీకి విక్రయిస్తున్న వ్యాపారులపై 146 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ తెలిపారు.