టీడీపీ పార్టీ మరో విన్నూతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రజలందరూ అయోమయంలో ఉన్న వివేకా హత్యకేసు గురించి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్లో వివేకానందరెడ్డి రాజకీయ చరిత్ర, వంశ నేపథ్యం, ఆయన హత్యకు గురైన రోజు నుంచి తేదీల వారీగా చోటుచేసుకున్న పరిణామాలతో రూపొందించారు. వివేకా హత్యపై జగన్ సహా వైసీపీ నేతలు గతంలో ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అంటూ ఆ వెబ్సైట్లో వీడియోలు అప్లోడ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ, సీబీఐ విచారణ, చార్జ్‌షీట్ అంశాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచారు.