కర్నూలు నగరంలోని బీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, గాయత్రీ ఎస్టేట్లోని నారాయణ ఇంగ్లీషు మీడియం పాఠశాలను కలెక్టర్ డా.జి.సృజన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొదటగా బీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిస్టమ్ డ్రాప్ ఔట్స్, స్కూల్ డ్రాపవుట్లు అందరినీ స్టూడెంట్ ఇన్ఫోలో అప్డేట్ చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం గాయత్రీ ఎస్టేట్లోని నారాయణ పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. 60 మందికి ఇంకా టీసీలు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీ క్యాంపులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలును పరిశీలించారు.