వ్యవసాయం అంటే ఏమిటో సరిగ్గా తెలియని వ్యవసాయ శాఖ మంత్రి, చంద్రబాబును తప్పుపట్టడం సిగ్గుచేటని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న కన్నబాబు, ఇప్పుడున్న కాకాణి వరదలపాలైన రైతుల్ని ఏనాడైనా పలకరించారా? అని ప్రశ్నించారు. వరి కోతల సమయంలో వరదలొస్తాయి.. తడిసిన ధాన్యం కొనరు. బ్రోకర్లను అడ్డంపెట్టుకుని, దోచుకోవడం తప్ప రైతుల గోడు వైసీపీ నేతలకు ఏం తెలుసు’’ అని సోమిరెడ్డి మండిపడ్డారు.