అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా మంత్రి జోగి రమేశ్, పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు బుధవారం పెడన వెళుతున్న జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకుని ఉయ్యూరు పట్టణ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా జనసేన మహిళా కమిటీ సభ్యులు మల్లెపు విజయలక్మి, రావి సౌజన్య మాట్లాడుతూ...... పవన్‌కల్యాణ్‌పై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. వైసీపీ నాయకులకు మహిళలే బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయని జనసేన వీర మహిళ లు అన్నారు