‘గ్రామాల ప్రజలు-పంచాయతీల సమస్యల’పై గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.పాపారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఏపీకి జాతీయ స్థాయిలో సర్పంచ్లకు, పంచాయతీలకు ఒక్క అవార్డు కూడా రాకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకున్న పంచాయతీల నిధుల కోసం రాజకీయాలకు అతీతంగా జరిగే పోరాటాలకు తాము మద్దతిస్తామని స్పష్టంచేశారు.తమకు పార్టీకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ముఖ్యమని తెలియజేసారు.