నాలుగేళ్ల క్రితం ఒంగోలు ఎక్కడుందో, ఎంత అభివృద్ధి కలిగి ఉందొ ఇప్పటికి అలానే ఉందని నారా లోకేష్ బహిరంగ సభలో తెలియజేసారు. ఒంగోలులో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో చేసిందేనని , వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కిస్తామన్నారు. అలానే న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.