కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. స్థానిక స్కందాన్షి ఉన్నతి విల్లాస్లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. నా గురించి వెతకవద్దని లేఖ రాసి పెట్టింది. భర్త దస్తగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.