రాష్ట్రంలో చికిత్స పొందుతున్న ఎయిడ్స్ రోగులకు మందుల కొరత రాకుండా చూసుకోవాలని , మూడు నెలల ముందుగానే ఇండెంట్లు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్) పీడీ జె.నివాస్ ఆదేశించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అయన మాట్లాడుతూ...... ఏపీ శాక్స్‌లో మందులు అందుబాటులో ఉంచాలని, చివరి నిమిషంలో మందుల్లేవనే సాకులు చెప్పొద్దని స్పష్టం చేశారు. అత్యవరమైతే స్థానికంగానే కొనుగోలు చేసుకోవాలన్నారు. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు, అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో బ్లడ్ స్టోరేజ్ యూనిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో టెస్టుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని, జిల్లాల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.