కోస్తా జిల్లాలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ అధినేత చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టినట్లు గుర్తు చేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.