ఏపీలో వరదల పరిస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై సమీక్షించిన అనంతరం పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 458 గ్రామాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, నాలుగు ఎన్‌డిఆర్‌ఎస్ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వరద బాధితులకు అండగా ఉండాలని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.