మణిపూర్లో మరో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మోయిరాంగ్ గ్రామంలో రెండు గ్రూపులకు చెందిన కొంత మంది మిలిటెంట్లు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికే చేరుకుని మిలిటెంట్లను చెదరగొట్టారు. గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు.