జూన్ నెలాఖరు వరకు వడదెబ్బ కారణంగా కేరళలో 120 మంది మృతి చెందారని, ఇది దేశంలోనే అత్యధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వారం లోక్ సభలో ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ (35), తెలంగాణ (20), మహారాష్ట్ర (14), తమిళనాడు (12), ఉత్తరప్రదేశ్ (12), పశ్చిమబెంగాల్ (11), మధ్యప్రదేశ్ (10) ఉన్నట్లు వెల్లడించింది. కాగా, హిమాచల్ ప్రదేశ్ (9), బీహార్ (8), ఒడిశా (7), ఆంధ్రప్రదేశ్(4)లో తక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది.