చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు సాధారణ వీసాలు కాకుండా స్టేపుల్డ్ వీసాలు మంజూరు చేసింది. దీని ఉద్దేశం అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమని, అక్కడి పౌరులు తమ దేశంలో పర్యటించడానికి వీసా అవసరం లేదని అర్థం. స్టేపుల్డ్ వీసా ప్రకటించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జట్టు పర్యటనను నిలిపివేసింది.